- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mumbai : నాలుగేళ్ల బాలుడిపై నుంచి దూసుకెళ్లిన కారు.. కారు డ్రైవర్ ఒక టీనేజర్
దిశ, నేషనల్ బ్యూరో : ముంబై(Mumbai)లో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొని అభంశుభం ఎరుగని నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు. ఆ కారును 19 ఏళ్ల యువకుడు డ్రైవ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోని వడాలా ప్రాంతంలో నాలుగేళ్ల బాలుడు రోడ్డుపై ఆడుకుంటుండగా.. అతడిపై నుంచి కారు దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. కారు నడిపిన టీనేజర్(teen driver)ను భూషణ్ గోలేగా గుర్తించామన్నారు.
అతడు తన హ్యూందాయ్ క్రెటా కారును రివర్స్ చేస్తుండగా ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. బాలుడిపై నుంచి కారు దూసుకెళ్లిందని గుర్తించిన వెంటనే టీనేజర్ అక్కడే ఆగిపోయాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడు భూషణ్ గోలేను అరెస్టు చేశారు. కారును నడిపిన టైంలో అతడు మద్యం మత్తులో లేడని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. చనిపోయిన బాలుడి ఫ్యామిలీ వడాలా ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై నివసిస్తోంది. బాలుడి తండ్రి కార్మికుడు.