- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pushpa-2: అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పై విమర్శలు.. ట్రెండింగ్ లో #alluarjunarrested
దిశ, వెబ్ డెస్క్: పుష్ప-2(Pushpa-2) ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్(Sandhya Theatre) లో జరిగిన తొక్కిసలాట(Stampade) ఓ మహిళ మృతి(Died) చెందగా.. మరో బాలుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ టాపిక్ ట్రెండింగ్(Trending) లో కొనసాగుతోంది. ఈ విషయంపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అసెంబ్లీ(Assembly)లో మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సినీనటుడు అల్లు అర్జున్(Allu Arjun) శనివారం సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి తన తప్పు ఏం లేదని, థియేటర్ కు వెళ్లిన కాసేపటికే పోలీసులు చెప్పడంతో తాను వెళ్లిపోయానని చెప్పారు. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నారు.
అల్లు అర్జున్ మీడియా ముఖంగా చెప్పిన మాటల్లో వాస్తవం లేదని, ప్రీమియర్ షోకు వచ్చిన అల్లు అర్జున్ ఇంటర్వెల్(Intervel) వరకూ ఉన్నారని, జాతర సీన్(Jathara Scene) కూడా చూశాకే వెళ్లారని మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అల్లు అర్జున్ పై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆవేధనలో అర్థం ఉందని, ప్రమాదానికి గురైన ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి.. 6 గంటలు జైళ్లో ఉన్న హీరో ఇంటికి పరామర్శకు వెళ్లడం ఏంటని ముఖ్యమంత్రికి సపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే "#alluarjunarrested" అనే హ్యాష్ టాగ్ ట్రెండింగ్ లోకి వెళ్లింది. ఇదిలా ఉండగా.. మహిళ చనిపోయిన విషయం హీరో తెలియదని, పోలీసులు కూడా చెప్పలేదని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.