Congress: ఈ నెల 24న కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన.. అమిత్ షా వ్యాఖ్యలపై నిరసన

by vinod kumar |
Congress: ఈ నెల 24న కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన.. అమిత్ షా వ్యాఖ్యలపై నిరసన
X

దిశ, నేషనల్ బ్యూరో: అంబేడ్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith shah) చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళనను ఉధృతం చేసింది. అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా డిసెంబర్ 22, 23 తేదీల్లో అన్ని లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సభ్యులతో కలిసి రాజ్యాంగంపై ఉద్దేశపూర్వక దాడిని ఎత్తిచూపుతూ దేశవ్యాప్తంగా 150 నగరాల్లో విలేకరుల సమావేశాలను నిర్వహించనున్నారు. 24న ప్రతి జిల్లా కేంద్రాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు అంబేడ్కర్ సమ్మాన్ యాత్ర చేపడతారు. అంతేగాక అమిత్ షా రాజీనామా చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతిపత్రాలు అందజేస్తారు. ఈ మేరకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ పార్టీ నేతలందరికీ సర్క్యులర్‌ జారీ చేసినట్టు కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం చైర్మన్ పవన్ ఖేరా తెలిపారు. డిసెంబరు 26-27 తేదీల్లో బెలగావిలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ విస్తృత సమావేశం జరగనున్నట్టు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed