8 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

by Sridhar Babu |
8 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
X

దిశ,సత్తుపల్లి : పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ సంఘటన సత్తుపల్లి మండలం చెరుకుపల్లి గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం సత్తుపల్లి మండలం చెరుకుపల్లి గ్రామ శివారులో ఖాళీ స్థలంలో పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు సత్తుపల్లి పట్టణ సీఐ టి. కిరణ్, ఎస్సై టి.కవిత ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకొని విచారించారు.

నిందితులు అమ్మపాలెం గ్రామానికి చెందిన ఈడ శివ నాగరాజు, తిరువూరుకు చెందిన పుచ్చ రాజు, మానుకుంట్ల శ్రీను అలియాస్ బాబు, రేజర్లకు చెందిన చెప్పుల నరసింహారావు, గుడ్ల రేవుకు చెందిన గుగ్గులోతు మోహన్ రావు, పాత కార్యిగూడెం గ్రామానికి చెందిన షేక్ సరవర్ పాషా, నూతిపాడుకు చెందిన షేక్ అబ్దుల్, ముచ్చనపల్లికి చెందిన ఫకీరయ్యగా గుర్తించారు. మరి కొందరు పారిపోయారు. నిందితుల నుంచి 3 లక్షల 80 వేల రూపాయల నగదు, 8 సెల్ ఫోన్లు, 6 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కవిత తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed