IMW: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్పిన ముప్పు..

by Ramesh Goud |
IMW: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్పిన ముప్పు..
X

దిశ, వెబ్ డెస్క్: అల్పపీడనం(Low Pressure) బలహీనపడటంతో(Weakened) ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రానికి ముప్పు తప్పినట్టు అయ్యింది. విశాఖకు(Visakhapatnam) 430 కిలో మీటర్ల దూరంలోని నైరుతి బంగాళఖాతంలో(Southwest Bay of Bengal) వాయుగుండం(Depression) కేంద్రీకృతం అవ్వడంతో ఏపీకి మూడవ ప్రమాద హెచ్చరికలు జారీ చేసి, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాస్త ఈ ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినట్లు వాతావరణ శాఖ అధికారులు(Meteorological Department Officials) వెల్లడించారు. దీంతో ఏపీ రాష్ట్రానికి భారీ వర్షాలు, ఈదుడు గాలుల ముప్పు తప్పింది. ఈ అల్పపీడన ప్రభావంతో నెల్లూరు(Nellore), చిత్తూరు(Chittoor) జిల్లాల్లో మూడు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండబ్ల్యూ(IMW) తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed