Rahul Gandhi: రాహుల్ గాంధీకి బరేలీ కోర్టు సమన్లు.. జనవరి 7న కోర్టుకు రాావాలని ఆదేశం

by Shamantha N |
Rahul Gandhi: రాహుల్ గాంధీకి బరేలీ కోర్టు సమన్లు.. జనవరి 7న కోర్టుకు రాావాలని ఆదేశం
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి ఉత్తరప్రదేశ్ కోర్టు నోటీసులు జారీ చేసింది. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో కులగణన(caste census )పై రాహుల్ చేసిన వ్యాఖ్యలు బరేలీ జిల్లా కోర్టు(Bareilly District Court) నోటీసులిచ్చింది. జనవరి 7న కోర్టుకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పంకజ్‌ పాఠక్‌ అనే వ్యక్తి కోర్టుని ఆశ్రయించారు. ముందుగా ప్రత్యేక ఎంపీ,ఎమ్మెల్యే కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణకు తిరస్కరించింది. దీంతో, పిటిషనర్ జిల్లా కోర్టుని ఆశ్రయించారు. రాహుల్ వ్యాఖ్యలు దేశంలో విభజనను, అశాంతిని ప్రేరేపించే విధంగా ఉందని కోర్టు జోక్యం అవసరమని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపైనే విచారణ చేపట్టిన బరేలీ కోర్టు రాహుల్ గాంధీకి నోటీసులు పంపింది.

హైదరాబాద్ లో..

హైదరాబాద్‌ లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొన్నారు. ఆసయమంలోనే ఆయన కులగణనపై వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై విమర్శులు గుప్పిస్తూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దేశంలో ఆర్థిక, సంస్థాగత సర్వే నిర్వహిస్తామని చెప్పారు. “వెనుకబడిన తరగతులు (ఓబీసీలు), షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు), మైనారిటీలకు చెందిన వారు ఎంత మంది ఉన్నారో తెలుసుకోవడానికి మొదట దేశవ్యాప్త కులగణన చేపడతాం. ఆ తర్వాత ఆర్థిక, సంస్థాగత సర్వే నిర్వహిస్తాం’అని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై పిటిషనర్‌ కోర్టుకు వెళ్లినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed