Vijayawada:కనకదుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రి

by Jakkula Mamatha |
Vijayawada:కనకదుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రి
X

దిశ,వెబ్‌డెస్క్: విజయవాడ(Vijayawada) దుర్గ అమ్మవారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం అమ్మవారి ఆలయానికి విచ్చేసిన తెలంగాణ మంత్రి(Telangana Minister) సీతక్క(seethakka) దుర్గగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా.దనసరి అనసూయ సీతక్కకు ఆలయ అధికారులు మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సీతక్క అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రి సీతక్కను వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదం చిత్రపటం అందజేశారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) సీనియర్ నాయకులు న్యాయవాది గంగ శెట్టి అయ్యప్ప తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed