- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేజీబీవీ విద్యాలయం ముందు ఆందోళన
by Kalyani |
X
దిశ, మక్తల్: కస్తూర్భా గాంధీ విద్యాలయం ముందు ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులు,ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత (పిడిఎస్ యు) ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. గత పది రోజులుగా తమను రెగ్యులరేషన్ చేయాలని సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు ఆందోళనలో పాల్గొంటున్నారు. దీంతో విద్యార్థులు నష్టపోతున్నారని పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి భాస్కర్ అన్నారు. ఇప్పటికే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా వచ్చిందన్నారు. విద్యార్థులకు క్లాసులు జరగకపోవడంతో..తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. తక్షణమే సర్వశిక్షన్ అభియాన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని,ఈ విషయాన్ని విద్యాధికారి అనిల్ గౌడ్ తో మాట్లాడగా..స్పందించి విద్యార్థులకు విద్యను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా నాయకులు అజయ్, రాకేష్ ,గణేష్, చెన్నయ్య త్రిమూర్తులు పాల్గొన్నారు.
Advertisement
Next Story