- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
JagapathiBabu : శ్రీతేజను ఆసుపత్రిలో పరామర్శించాను : జగపతిబాబు సంచలన వీడియో
దిశ, వెబ్ డెస్క్ : పుష్ప-2 ప్రీమియర్ షో(Pushpa-2 Premiere Show) సందర్భంగా సంధ్య థియేటర్లో(Sandhya Theater) జరిగిన తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీ(Assembly Sessions) వేదికగా శనివారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తొక్కిసలాటకు అల్లు అర్జున్ రోడ్ షో కారణమని, హీరో బాధ్యత లేకుండా ప్రవర్తించారని మండిపడ్డారు. ఒక్కరోజు జైలుకు వెళ్ళి వస్తే సినీ ప్రముఖులు ఆయన ఇంటికి క్యూ కట్టారని.. రేవతి కుటుంబాన్ని, ఆసుపత్రిలో ఉన్న బాలున్ని గాని ఎవరూ పరామర్శించలేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో, సినీ ఇండస్ట్రీలో దూమరాన్ని రేపుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై సినీ నటుడు జగతిబాబు(JagapathiBabu) స్పందించారు. రేవతి(Revathi) కుటుంబానికి సినీ ఇండస్ట్రీ నుండి పరామర్శ లేదు అన్నది అబద్దం అన్నారు. తాను షూటింగ్ నుండి రాగానే శ్రీతేజ్(SriTeja)ను హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించానని, రేవతి కుటుంబానికి భరోసాగా ఉంటానని ధైర్యం చెప్పానని, వైద్యులను శ్రీతేజ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నానని తెలిపారు. హ్యూమనిటెరియన్ గ్రౌండ్స్ లో బాబును పలకరించడానికి వెళ్లానన్నారు. పబ్లిసిటీ చేసుకోలేదు కాబట్టి ఎవరికి తెలియదని, సినీ ఇండస్ట్రీ నుండి ఎవరూ వెళ్లలేదని అన్నందుకు ఇప్పుడు చెప్పాల్సి వస్తోందని జగపతిబాబు వీడియోలో పేర్కొన్నారు.