Revanth Reddy: కాకా వెంకట స్వామి వర్థంతి సందర్భంగా సీఎం ఘన నివాళులు

by Ramesh Goud |   ( Updated:2024-12-22 07:40:51.0  )
Revanth Reddy: కాకా వెంకట స్వామి వర్థంతి సందర్భంగా సీఎం ఘన నివాళులు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ కేంద్రమంత్రి కాకా వెంకట స్వామి (Former Union Minister Kaka Venkata Swamy) వర్ధంతి (Death Anniversary) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఘన నివాళులు(Paid Tributes) అర్పించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా కాకా ఫోటోతో కూడిన స్పెషల్ పోస్ట్ పెట్టారు. దీనిపై ఆయన.. పార్లమెంట్(Parliament) లో పేదల ప్రతినిధిగా ప్రతిధ్వనించిన నాయకుడు.. అని, పేదల పక్షపాతి, దళిత జన బాంధవుడు, స్వాతంత్ర సమరయోధుడు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుడు అని కాకాను కొనియాడారు. అలాగే కేంద్ర మాజీమంత్రి గడ్డం వెంకటస్వామి వర్థంతి సందర్భంగా రేవంత్ రెడ్డి నివాళి తెలియజేశారు. కాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడుగా ఉన్న వెంకటస్వామి తెలుగు ప్రజలకు కాకా గా సుపరిచితమైన వ్యక్తి. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఆయన కేంద్ర, రాష్ట్రాల్లో అనేక పదవులు చేపట్టారు. ఇవాళ కాకా వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed