- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మక్తల్ నియోజకవర్గంలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: హాలిడే.. వచ్చిందంటే చాలు అక్రమ ఇసుక రవాణా దారులకు కాసుల వర్షం కురుస్తోంది. కృష్ణా నది పరివాహక ప్రాంతం ఉండడంతో ఈ నియోజకవర్గంలో ఇసుక పెద్ద మొత్తంలో ఉంటుంది. ప్రభుత్వ, ప్రజల అవసరాలకు ఆన్లైన్ లో ఇసుక ను ప్రభుత్వమే విక్రయించాలని గతంలో నిర్ణయించిన.. ఆ తర్వాత అధికార పార్టీ నేతల ఒత్తిడి. తదితర కారణాలతో... ఆన్లైన్ ఇసుక విక్రయాలు కొన్నాళ్లు సాగి.. నిలిచిపోయాయి. దీన్ని అదునుగా తీసుకున్న కొంతమంది ధనార్జన కోసం ఇసుక రవాణాను ఎంచుకున్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, టిప్పర్లు కొనుగోలు చేసి వీలు చిక్కినప్పుడల్లా ఇసుకను తరలించి డంపులుగా వేసుకొని.. వీలున్నప్పుడు వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలోని ఇసుక అత్యంత నాణ్యమైనది, కావడంతో మంచి ధరలు పలుకుతున్నాయి. స్థానికంగా ఒక టిప్పర్‌కు 20 వేలు, మహబూబ్ నగర్, గద్వాల తదితర ప్రాంతాలకు తీసుకువెళ్తే రూ.40 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతం నుంచి కర్ణాటకలోని రాయ్ చూర్ కు సైతం ఇసుక పెద్ద ఎత్తున తరలిపోతోంది. ఈ ఇసుక తరలింపులో ఇసుక మాఫియా కీరోల్ పోషిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అవసరం కోసం రాజకీయాల మార్పులు..
అక్రమంగా ఇసుక వ్యాపారాలు తమ వ్యాపారం కోసం పార్టీలు మారుతూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్‌లో ఉన్న కొంతమంది ఇసుక వ్యాపారులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్‌ను వీడీ కాంగ్రెస్ పార్టీలో చేరి వ్యాపారాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. కొంతమంది అధికార పార్టీ ముఖ్యనేత అండదండలు ఉన్నాయంటూ చెప్పుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు.
సెలవు రోజుల్లో.. మరింత జోరుగా
సెలవు రోజులలో అక్రమ ఇసుక రవాణా మరింత జోరుగా సాగుతోంది. రెవెన్యూ, తదితర ముఖ్య శాఖల అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండకపోవడంతో ఇసుక వ్యాపారులు పోలీసులను మేనేజ్ చేసుకొని వ్యాపారాలు సాగిస్తున్నారని నియోజకవర్గ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. అధికార పార్టీ ముఖ్య నేతలు, కొంతమంది అధికారుల అండదండలతోనే ఇసుక రవాణాకు ఇష్టారాజ్యాంగా సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పోలీసు వాహనాల ఎదుటే దర్జాగా..
పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసుల వాహనాల ముందు నుంచే ఇసుక టిప్పర్లు వెళుతున్నా వాటిని పట్టుకునే పరిస్థితిలే లేవని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ- కర్ణాటక సరిహద్దు ప్రాంతం కృష్ణ వద్ద చెక్ పోస్టు వద్ద ఎక్సైజ్, అగ్రికల్చర్, రోడ్లు భవనాల శాఖలకు సంబంధించిన సీసీ కెమెరాలు ఉండగా.. పోలీసులకు సంబంధించిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సంబంధిత అధికారులు ఈ అంశాలపై తగిన నిర్ణయాలు తీసుకుని అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.