జగిత్యాలకు టూరిజం ప్రాజెక్టు మంజూరు చేయండి

by Sridhar Babu |
జగిత్యాలకు టూరిజం ప్రాజెక్టు మంజూరు చేయండి
X

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : జగిత్యాల నియోజకవర్గానికి టూరిజం ప్రాజెక్టు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎక్సైజ్ అండ్ టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావును కోరారు. జగిత్యాల అర్బన్ మండలం అంబరిపేటలో నగర్ వన్ ప్రాజెక్టు, బీర్పూర్ రోళ్ల వాగు ప్రాజెక్టును పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి నిధుల మంజూరుకు హామీ ఇచ్చినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు.

Advertisement

Next Story