- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుర్తు తెలియని యువకుడి దారుణ హత్య
దిశ, మెదక్ ప్రతినిధి : మంబోజి పల్లి శివారులోని పసుపులేటి బ్రిడ్జి సమీపంలో గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన బుధవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు మంబోజి పల్లి శివారు పరిధిలోని పసుపులేటి బ్రిడ్జి యువకుడి మృతదేహం ఉన్న సమాచారంతో రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సుమారు 25 ఏళ్ళ వయసు కలిగిన యువకుడు హత్యకు గురైనట్లు గుర్తించారు.
మృతదేహానికి సమీపంలో బండరాయి ఉంది. తల పగిలి రక్తం కారుతోంది. యువకుడి తో పాటు వచ్చిన వారే బండరాయితో కొట్టి చంపి ఉంటారని భావిస్తున్నారు. విషయం తీసుకున్న ఘటన స్థలానికి డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ మురళీ లు వచ్చారు. హత్యకు గురైన వ్యక్తి ఎవరు అనేది తెలిస్తేనే హత్యకు గల కారణాలు తెలిసే అవకాశాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.