Pushpa-2: పుష్ప-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా భోజ్‌పురి స్టార్.. పోస్ట్ వైరల్

by sudharani |
Pushpa-2: పుష్ప-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా భోజ్‌పురి స్టార్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్నే (Allu Arjun), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’ (Pushpa-2). ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ కోసం ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల (Sree leela) ‘కిస్సిక్’ అనే ఐటెం సాంగ్‌లో మెరవబోతున్నట్లు ఇటీవల అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. దీంతో ‘పుష్ప-2’ చిత్రంపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మరింత పెరిగిపోయింది. వీటికి తోడుగా ఈ సినిమా ట్రైలర్‌పై ఇస్తున్న హైప్ అంతా ఇంతా కాదు. నవంబర్-17 అనగా రేపు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చెయ్యగా.. ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.

అయితే.. ఇప్పుడు ఇంకొంచెం క్యూరియాసిటీ (curiosity)ని పెంచుతూ మరో అప్‌డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ఈ మేరకు ‘పాట్నా ఒక అద్భుతమైన సాయంత్రానికి సాక్షిగా మారబోతోంది. ప్రముఖ భోజ్‌పురి స్టార్ @అక్షరసింగ్ (Akshara Singh) #Pushpa2 TheRule Trailer లాంచ్ ఈవెంట్‌లో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు. రేపు 𝐆𝐚𝐧𝐝𝐡𝐢 𝐌𝐢𝐢𝐝𝐧, 𝐏𝐭𝐭𝐧𝐚 వద్ద సాయంత్రం 5 గంటల నుండి స్టార్ట్ కానుంది. ఇక సాయంత్రం 6.03 గంటలకు డిజిటల్ లాంచ్ (Digital Launch) ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా భోజ్‌పురి స్టార్ అక్షర సింగ్ పర్ఫామెన్స్ ఉందని తెలుసుకున్న ఫ్యాన్స్ సంబర పడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed