- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Electric scooter : హైదరాబాదు లాంటి పట్టణాల్లో వాడేందుకు ది బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పైగా..?
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాదు(Hyderabad)లాంటి పెద్ద పెద్ద పట్టణాల్లో వాహనాలు నడపాలంటే కాస్త కష్టమే. ట్రాఫిక్(traffic) ఉన్నట్లైతే.. ఇక కారు లాంటివి అయితే ఇక అంతే సంగతి. కాగా చాలా మంది ట్రాఫిక్‌లో ఫాస్ట్‌గా వెళ్లేందుకు కంఫార్ట్‌గా ఉండే వాహనాన్ని ఎంచుకుంటారు. అలాంటి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్(Electric scooter) తాజాగా ఇండియన్ ఆటోమొబైల్(Indian Automobile) మార్కెట్‌లోకి వచ్చేసింది. ఇక నగరాల్లో ప్రయాణాల కోసం చింతన అక్కర్లేదు.
2 వీల్ ఈవీ సెగ్మెంట్(2 wheel EV segment)లోకి వచ్చిన న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ ను జెలియో సంస్థ(Zelio company).. ఎక్స్ మెన్ 2. 0 పేరుతో తాజాగా రిలీజ్ చేసింది. దీని ధర 7, 500 నుంచి ప్రారంభవమవుతోంది. ఇది షో రూం ప్రైస్. సిల్వర్(Silver), గ్రీన్(Green), వైట్(White), రెడ్(Red) కలర్ స్కీమ్‌లలో లభిస్తుంది. తాజాగా లాంచ్ అయిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లిథియం-అయాన్ బ్యాటరీ(Lithium-ion battery), లీడ్ యాసిడ్(Lead acid) అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. లీడ్ యాసిడ్ బ్యాటరీ 60వీ 32ఏహెచ్ బ్యాటరీ రేటు 71,500 రూపాయలు ఉంటుంది. 72వీ 32ఏహెచ్ బ్యాటరీ ధర 74 వేల రూపాయలు ఉంటుంది. లిథియం అయాన్ బ్యాటరీ 60వీ 30ఏహెచ్ ధర రూ.87,500.. 74వీ 32ఏహెచ్ ధర రూ.91,500 గా ఉంది.
ఈ స్కూటర్ 90 కిలోల వెయిట్ ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్ల వరకు పోతుంది. మీరు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా వంద కిలోమీటర్లు ఏం చక్కా ప్రయాణం చేయొచ్చు. మోటారు 60/72వీ యూనిట్, ఇది ఛార్జ్‌కి 1.5 యూనిట్ల విద్యుత్‌ను వాడుతుందని జెలియో సంస్థ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సెంట్రల్ లాకింగ్(Central locking), యాంటీ థెఫ్ట్ అలారం(Anti-theft alarm), పార్కింగ్ స్విచ్(Parking switch), రివర్స్ గేర్(Reverse gear), డిజిటల్ డిస్ప్లే యూఎస్బీ ఛార్జర్(Digital display USB charger) వంటి ఫీచర్లు వస్తాయి.