- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బాహుబలికంటే బెటర్ సినిమా తీస్తావా..?’.. సందీప్ వంగాకు RGV ఛాలెంజ్.. వంగా రిప్లై ఇదే..!
దిశ, వెబ్‌డెస్క్: స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకి ఆర్జీవీ షాకింగ్ ఛాలెంజ్ విసిరారు. ‘రాజమౌళి తీసిన బాహుబలి కంటే బెటర్ సినిమా తీస్తావా..?’ అంటూ ఆర్జీవీ సంధించిన క్వశ్చన్ ఇప్పుడు వైరల్ అవుతుంటే.. ఆ చాలెంజ్‌కి సందీవ్ వంగా ఇచ్చిన ఆన్సర్ ఇంకా సెన్సేషన్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ రోజు (శనివారం) మధ్యాహ్నం హైదరాబాద్ నోవోటెల్‌లో జరిగిన సినిమాటికా ఎక్స్‌పోలో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ఫైర్‌సైడ్ చాట్ సెషన్ అంటూ ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు ఆర్జీవీ. ఈ క్రమంలోనే ‘బాహుబలి కంటే బెటర్ సినిమా తీస్తావా..?’ అని అడిగారు.
దానికి సందీప్ రెడ్డి వంగా ‘ఎస్’ అని ఆన్సర్ ఇవ్వడంతో వెంటనే ఆర్జీవీ ‘ఇదే నేను కోరుకుంటున్నాను’ అంటూ వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చి సందీప్ వంగాను అభినందించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్జీవీ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసి.. ‘నేను సందీప్ రెడ్డి వంగాను బాహుబలికంటే బెటర్ సినిమా తీస్తారా..?’ అని అడిగాను. సినిమాటికా ఎక్స్‌పో మేం చక్కటి టైం స్పెండ్ చేశాం. ఆర్గనైజర్లకు ఇదిగో 30 ముద్దులు..’’ అంటూ 30 కిస్ ఎమోజీలను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. ఇక దీనిపై కొంతమంది కామెంట్స్ చేస్తూ.. సందీప్ కచ్చితంగా బాహుబలికంటే బెటర్ సినిమా తీస్తారని ధీమాగా చెబుతుంటే.. రాజమౌళిని బీట్ చేసే సత్తా సందీప్‌కి లేదని ఇంకొంతమంది విమర్శిస్తున్నారు.