Revanth Reddy: చంద్రబాబు సోదరుడి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

by Ramesh Goud |   ( Updated:2024-11-22 12:39:24.0  )
Revanth Reddy: చంద్రబాబు సోదరుడి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు(CM Chandrabu) సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దిగ్భ్రాంతి(shock) వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రామ్మూర్తి నాయుడు మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి సానుభూతి(Condolences) తెలపుతూ ట్విట్టర్ లో ప్రత్యేక పోస్ట్ పెట్టారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు.. మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు(Former MLA Nara Rammurthy Naidu) మృతి దిగ్భ్రాంతికరమని భావోద్వేగబరిత వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూన్నానని తెలిపారు. అంతేగాక వారి కుటుంబ సభ్యులకు రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా మహారాష్ట్రలో ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

Advertisement

Next Story