Pilot Rohit Reddy : సోదరుడికి అండగా నిలబడలేవా ? : మహేందర్ రెడ్డికి పైలట్ ప్రశ్న

by Y. Venkata Narasimha Reddy |
Pilot Rohit Reddy : సోదరుడికి అండగా నిలబడలేవా ? : మహేందర్ రెడ్డికి పైలట్ ప్రశ్న
X

దిశ, వెబ్ డెస్క్ : జిల్లాకు నేనే పెద్ద దిక్కునని చెప్పుకుని తిరిగే మాజీ మంత్రి, మండలి చీప్ విప్ పట్నం మహేందర్ రెడ్డి( Patnam Mahender Reddy) ఇప్పుడు లగచర్ల ఘటనపై ఎందుకు మౌనంగా ఉన్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి(Pilot Rohit Reddy )ప్రశ్నించారు. సొంత సోదరుడైన పట్నం నరేందర్ రెడ్డికి అండగా నిలబడలేవా? కొడుకు కోసం ఇంట్లో ఉన్న 90 ఏళ్ల మీ తల్లి ఆవేదన నీకు కనిపించడం లేదా? అని, నరేందర్ రెడ్డి భార్య, పిల్లల ఆవేదన నీకు కనిపిస్తలేదా అని రోహిత్ రెడ్డి నిలదీశారు. తెలంగాణ భవన్ లో రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పదవి దాహంతో, సొంత ఆస్తులను కాపాడుకునేందుకు సొంత కుటుంబాన్ని పట్టించుకోని మహేందర్ రెడ్డి ప్రజలకు ఏం న్యాయం చేస్తారని విమర్శించారు. నరేందర్ రెడ్డి జైలుకు వెళ్లడం వెనుక ఆయన అన్న మహేందర్ రెడ్డి కుట్ర కూడా ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ లోకి తనతో పాటు చేరలేదన్న కారణంతోనే నరేందర్ రెడ్డిపై మహేందర్ రెడ్డి కుట్ర చేశారన్నారు. పట్నం కుటుంబానికి చెందిన వాడైతే మహేందర్ రెడ్డి వెంటనే తన పదవులకు రాజీనామా చేసి తమ్ముడి కుటుంబానికి, లగచర్ల ప్రజలకు అండగా నిలబడాలన్నారు. పట్నం సునిత కడా చైర్మన్ వెంకట్ రెడ్డిని పరామర్శించి మరిది నరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణమన్నారు.

అధికారులపై దాడిని అందరూ ఖండించాల్సిందేనని, అయితే అనుకోకుండా జరిగిన సంఘటనను కుట్ర పూరితమన్న ముద్ర వేసి గ్రామస్తులపై కేసులు మోపడాన్ని కూడా ఖండిస్తున్నామన్నారు. దాడి సంఘటనలో లేని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై రాజకీయ కక్షతోనే ఈ కేసులో ఏ1గా కేసు పెట్టారన్నారు. వెంటనే నరేందర్ రెడ్డితో పాటు కేసుతో సంబంధం లేని వారిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో 14వేల ఎకరాలను ఫార్మాసిటీ కోసం సేకరిస్తే వాటిని వాడుకోకుండా పల్లెల్లో రైతుల పంట పొలాల్లో ఫార్మా కంపెనీలు ఎందుకు పెట్టాలనుకుంటున్నారో ప్రభుత్వం జవాబు చెప్పాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed