60 శాతమున్న బీసీలకు 22 సీట్లేనా..? బీఆర్ఎస్‌పై కేఏ పాల్ విమర్శలు

by Satheesh |   ( Updated:2023-08-22 14:12:53.0  )
60 శాతమున్న బీసీలకు 22 సీట్లేనా..? బీఆర్ఎస్‌పై కేఏ పాల్ విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కేసీఆర్ కుల, కుటుంబ అవినీతి పాలన కొనసాగిస్తున్నారని.. బీఆర్ఎస్ తొలి జాబితాతో అర్థం అవుతోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. ఒక్క శాతం కూడా లేని వెలమలకు 11 టికెట్లు ఇచ్చి 60 శాతం ఉన్న బీసీలకు కేవలం 22 స్థానాల్లోనే అవకాశం ఇచ్చారని ధ్వజమెత్తారు. రిజర్వుడు సీట్లలో మినహా ఎస్టీ, ఎస్సీలకు అదనంగా ఒక్క సీటు కూడా ఇవ్వలేదని.. జనాభాలో 20 శాతం ఉన్న క్రిస్టియన్స్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు ఇప్పటికైనా ఆలోచన చేయాలన్నారు. కేసీఆర్ కుటుంబంపై కోపంతో కాంగ్రెస్ వైపు వెళ్లిన అక్కడ రెడ్లకే ప్రాధాన్యత ఉందన్నారు. బలహీన వర్గాల పాలన రావాలంటే ప్రజాశాంతి పార్టీనే మేలని ఈ విషయాన్ని గుర్తించిన గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే గద్దర్ విషయంలో అందరూ శవ రాజకీయాలే చేశారని ధ్వజమెత్తారు.

Advertisement

Next Story