- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బంధువుల ఇంటికొస్తే బంగారం మాయం
దిశ, దుగ్గొండి: బంధువుల బంగారం ఇంటికొస్తే బంగారం మాయమైంది. ఫంక్షన్ కోసం మూడు నాలుగు రోజులు ఇల్లు విడిచి వెళితే దొంగలు పడతారేమోనన్న బాధితురాలి భయం నిజమే అయింది. హైదరాబాద్ కు చెందిన నాయొజుల మంజుల వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలో తన బావ అయిన పలికేజు కిషోర్ ఇంటికి 13 వ తేదీన గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చింది. ఇల్లు వదిలి మూడు, నాలుగు రోజులు వెళ్తున్నాను అనే భయంతో ఆమెకున్న 12 తులాల బంగారు అభరణాల వెంట తెచ్చుకుంది. 13, 14 వ తేదీలలో బంగారం ధరించి బ్యాగులో భద్రంగా దాచుకుంది. శుక్రవారం ఆమె బంగారు ఆభరణాలు బ్యాగు ను చూసుకోగా ఆభరణాలు 5 తులాల హారం, అర్ధ తులం కడెం, 2 తులాల ఉంగరాలు, మొబైల్ ఫోన్ కనిపించకుండా పోయాయి. తన ఆభరణాలు అపహరణకు గురైందని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ సాయి రమణ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. భాధితురాలు మంజుల ఇచ్చిన ఫిర్యాదుతో సీఐ సాయి రమణ విచారణ చేపట్టారు.