- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Heavy Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. రాష్ట్రానికి మరోసారి భారీ వర్ష సూచన!
దిశ,వెబ్డెస్క్: రాష్ట్రాన్ని భారీ వర్షాలు(Heavy Rains) వీడడం లేదు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం(low pressure) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో ఏపీలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం వైపు అల్పపీడనం పయనిస్తోంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల వరకు ఏపీలో విస్తారంగా వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో నేడు(మంగళవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడులో వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రేపు(బుధవారం) ఈ పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ(Department of Meteorology) వెల్లడించింది. రానున్న మూడు రోజులు భారీ వర్ష సూచన ఉండడంతో రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.