Ajay Bhalla: మణిపూర్ గవర్నర్‌గా అజయ్ భల్లా.. ఉత్తర్వులు జారీ చేసి రాష్ట్రపతి భవన్

by vinod kumar |
Ajay Bhalla: మణిపూర్ గవర్నర్‌గా అజయ్ భల్లా.. ఉత్తర్వులు జారీ చేసి రాష్ట్రపతి భవన్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోని ఐదు రాష్ట్రాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త గవర్నర్లను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మణిపూర్ కొత్త గవర్నర్‌గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా (Ajay kumar Bhalla), మిజోరాం గవర్నర్‌గా మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ విజయ్ కుమార్ సింగ్ (Vk singh) నియామకమయ్యారు. అలాగే కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్‌ను బిహార్‌కు, బిహార్ గవర్నర్‌గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కేరళ గవర్నర్‌గా అపాయింట్ చేశారు. ఇక, ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ రాజీనామాను ఆమోదించిన ముర్ము ఆయన స్థానంలో ప్రస్తుతం మిజోరం గవర్నర్‌గా ఉన్న డాక్టర్ కంభంపాటి హరిబాబును నియమించారు. వీరంతా త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.

కాగా, మణిపూర్ గవర్నర్‌గా నియమితులైన అజయ్ కుమార్ భల్లా 1984 బ్యాచ్‌కి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. 2019న కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా నియమితులైన ఆయన 2024 ఆగస్టు వరకు భారత హోం కార్యదర్శిగా పనిచేశాడు. అలాగే మిజోరాం గవర్నర్‌గా ఎంపికైన మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ మోడీ ప్రభుత్వంలో గతంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. 2024 ఎన్నికల్లో ఆయన బరిలో నిలవలేదు. ఈ నేపథ్యంలోనే కేంద్రం గవర్నర్‌గా నియమించింది.

Advertisement

Next Story

Most Viewed