- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ED: అక్రమరవాణా కేసులో కొనసాగుతున్న ఈడీ దర్యాప్తు
దిశ, నేషనల్ బ్యూరో: కెనడా (Canada) సరిహద్దుల నుంచి అమెరికా (US)లోకి భారతీయులను అక్రమంగా తరలించేందుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) దర్యాప్తు చేస్తోంది. ఇందులోభాగంగా కెనడాలోని కొన్ని కాలేజీలు, భారత సంస్థల ప్రమేయంపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. 2022 జనవరి 19న గుజరాత్‌లోని దింగుచా గ్రామానికి చెందిన నలుగురు కుటుంబసభ్యులు కెనడా సరిహద్దు నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు యత్నించే సమయంలో చనిపోయారు. ఈ ఘటనతో అక్రమరవాణా కేసు వెలుగులోకి వచ్చింది. ఆ కేసును ఆధారంగా చేసుకొని ఈడీ దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు భవేష్ పటేల్‌తో పాటు మరికొందరిపైనా మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. నిందితులు అక్రమంగా తరలించే (Human trafficking) సంస్థలతో కలిసి కుట్ర పన్ని.. భారత ప్రజలకు మాయమాటలు చెప్పి వారిని దేశ సరిహద్దులు దాటిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాంటివారిని కెనడా మీదుగా అమెరికాకు అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు.
మాయమాటలు చెప్పి
అయితే, అమెరికాలో స్థిరపడాలనుకునేవారికి కెనడా, అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్న భారతీయులకు మాయమాటలు చెప్పి ట్రాప్ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ అధికారులు తెలిపారు. ఒక్కొక్కరి నుంచి రూ.55 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు. స్టూడెంట్ వీసాపై కెనడాకు వెళ్లినవారు అక్కడి యూనివర్సిటీల్లో చేరట్లేదన్నారు. కానీ,కాలేజీలో చేరేందుకు బదులుగా వారిని అక్రమంగా సరిహద్దులు దాటిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, కాలేజీలు వారి నుంచి తీసుకున్న అడ్మిషన్ ఫీజును తిరిగి ఆయా వ్యక్తుల ఖాతాల్లో జమ చేసేవారని తెలిపారు. దీనికి సంబంధించిన సమాచారం కోసం ఈ కేసులో ముంబై, నాగ్‌పుర్, గాంధీనగర్, వడోదరా సహా 8 ప్రదేశాల్లో సోదాలు చేపడుతున్నట్లు ఏజెన్సీ తెలిపింది. విదేశాల్లోని యూనివర్శిటీల్లో భారతీయులకు ప్రవేశం ఇప్పించడానికి ముంబయి, నాగ్‌పుర్ ఉన్న రెండు సంస్థలు పని చేస్తున్నట్లు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. వీరు ఏటా దేశంలోని వివిధ కళాశాలల నుంచి సుమారు 35వేల మంది విద్యార్థులను దేశం దాటిస్తున్నారని తెలిపారు. గుజరాత్‌లో దాదాపు 1,700 మంది ఏజెంట్లు, దేశవ్యాప్తంగా 3500 మంది ఏజెంట్లు ఉన్నారని చెప్పుకొచ్చారు. వీరిలో దాదాపు 800 మంది యాక్టివ్ గానే ఉన్నారని అన్నారు. కెననడాలో ఉన్న దాదాపు 112 కళాశాలలు ఒక సంస్థతో, 150కి పైగా కాలేజీలు మరో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తేలిందన్నారు. ఆ కేసుల్లోనూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.