ట్రాన్స్ జెండర్లకు అండగా నిలబడి వారి శక్తిని గుర్తిద్దాం: సీఎం రేవంత్ రెడ్డి

by Mahesh |
ట్రాన్స్ జెండర్లకు అండగా నిలబడి వారి శక్తిని గుర్తిద్దాం: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ పోలీస్ ఫోర్స్ లో సహాయకులుగా ప్రభుత్వం నియమించింది. వారు బుధవారం నుంచి విధులను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యుగయుగాలుగా, ట్రాన్స్ జెండర్లను ప్రధాన స్రవంతిలోకి నడిపించడానికి, సానుకూల సామాజిక ఫలితాల కోసం వారి శక్తిని ఇతర పనులు చేసుకునేందుకు మళ్లించడానికి, వారి స్థితిని మార్చడానికి ఒక మార్గం గురించి ఎవరూ ఆలోచించలేదన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ట్రాఫిక్ పోలీస్ ఫోర్స్‌లో సహాయకులుగా గుర్తించడం, నియమించడం, శిక్షణ ఇవ్వడం, చేర్చడం వంటి అసాధారణ చర్యలను చేపట్టి వారికి అండగా నిలుస్తుందన్నారు. మొదటి రోజు నుంచే వారు వారి వృత్తి పట్ల నిబద్ధతో వ్యవహరిస్తూ ఎంతో ప్రభావాన్ని చూపడం గర్వంగా ఉందన్నారు. వారు ఇలాగే నిరంతరం పరివర్తన సాధించడానికి మనమందరం మద్దతుగా నిలుద్దాం అంటూ ఎక్స్(ట్విట్టర్)లో సీఎం స్పందించారు.

Advertisement

Next Story

Most Viewed