ఇద్దరు యువకుల ప్రాణం తీసిన ఫ్లెక్సీలు..

by Sumithra |
ఇద్దరు యువకుల ప్రాణం తీసిన ఫ్లెక్సీలు..
X

దిశ, కొల్చారం : మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారి పై వేసిన ఫ్లెక్సీలకు విద్యుత్ వైర్లు తాకడంతో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన గురువారం తెల్లవారుజామున కొల్చారం మండలం కిష్టాపూర్ లో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అక్కిం యాదగిరి కుమారుడు నవీన్ (21), పసుపుల చిన్న వెంకటేశం కుమారుడు పసుపుల ప్రసాద్ (20)లు గురువారం తెల్లవారుజామున తమ వ్యవసాయ పొలంలో నారుమడిలో నీరు పెట్టి, అడవి పందులు రాకుండా మంటలు పెట్టడానికి వెళ్లారు.

తమ పొలం సమీపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు విద్యుత్ హై టెన్షన్ వైర్ కు ఆనుకొని ఉండడంతో ఫ్లెక్సీల కాంట్రాక్టర్ వాటిని విడిచి పెట్టి వెళ్ళాడు. వాటిని తీయడానికి ప్రసాద్ నవీన్ లు ప్రయత్నించగా విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్ఐ మొహమ్మద్ గౌస్ కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఒకేసారి మృతి చెందడంతో కిష్టాపూర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story