రాష్ట్రానికి వర్ష సూచన.. ఉదయం పొగమంచు

by srinivas |
రాష్ట్రానికి వర్ష సూచన.. ఉదయం పొగమంచు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా శుక్రవారం పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం కారణంగా రాష్ట్రంలో ఈదురు గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వీస్తాయని తెలిపింది. శనివారం నుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అలాగే రాబోయే 5 రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తుందని తెలిపింది.

కాగా నిన్న బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలక పాటి నుంచి వర్షాలు కురిశాయని మేడ్చల్, మల్కాజిగిరిలో 20 మిల్లీమీటర్లు, ములుగులో 5.5 మిల్లీమీటర్లు, హైదరాబాద్,​షేక్​పేటలో 6.8 మిల్లీమీటర్లు, బహదూర్​పురలో 6.3 మిల్లీమీటర్లు, నాగర్​ కర్నులులో 5.3 మిల్లీమీటర్లు, సిద్దిపేటలో 5.01 మిల్లీమీటర్లు, రంగారెడ్డి జిల్లాలో 5.0 మిల్లీమీటర్లు, కరీంనగర్​జిల్లా కేంద్రంలో 4.00 మిల్లీమీటర్లు, యాదాద్రి భువనగిరిలో 3.8 మిల్లీమీటర్లు, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో 3.3 మిల్లీమీటర్లు, మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాలో 3.0 మిల్లీమీటర్లు వర్షం కురిసిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో రాబోయే 5 రోజులలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీలు తగ్గుతాయని, కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అవుతున్న ప్రాంతాల్లో హైదరాబాద్, పటాన్​చెరువు, రాజేంద్రనగర్, హయత్​నగర్, దుండిగల్, హకీంపేట, మెదక్​, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్​నగర్, రామగుండం, ఖమ్మం, భద్రాచలం, నల్గొండ ప్రాంతాలు ఉన్నాయని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed