మద్యం తాగి బండెక్కితే కటకటాలే

by Naveena |
మద్యం తాగి బండెక్కితే కటకటాలే
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: నూతన సంవత్సరం ఎంజాయ్ చేద్దామని మద్యం తాగి బండి నడిపితే కటకటాల పాలవుతారని మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. గురువారం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 31 న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్ల పరిధిలో 10 ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ టీం లను ఏర్పాటు చేస్తున్నట్లు,మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు నిలబెడతామని ఆయన హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వలన ప్రాణ నష్టంతో పాటు..క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారని,ప్రమాదాల నివారణకు తనిఖీలు విస్తృతం చేశామని ఆయన తెలిపారు. జాతీయ రహదారిపై నిత్యం హై స్పీడ్ తో వెళ్ళే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని,ప్రతి రోజు 75 కేసులు నమోదు అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా తమ చర్యలతో వాహనదారులలో మార్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

Advertisement

Next Story

Most Viewed