Mallikharjuna Kharge : ఎన్నికల ప్రక్రియపై ఖర్గే సంచలన వ్యాఖ్యలు

by M.Rajitha |
Mallikharjuna Kharge : ఎన్నికల ప్రక్రియపై ఖర్గే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ :భారత్ లో జరుగుతున్న ఎన్నికల విధానంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikharjuna Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియ, విధానం పట్ల ప్రజల్లో నమ్మకం పోతోందని అన్నారు. ఈసీ(EC) నిష్పాక్షితపై అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. దేశంలోని కీలక వ్యవస్థలను గుప్పిట్లో ఉంచుకోవాలని బీజేపీ(BJP) ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం(ECE) లాంటి రాజ్యాంగబద్ధ సంస్థను తమ కనుసన్నల్లో ఉంచుకోవాలని బీజేపీ చూస్తోందన్నారు. దీనిపై పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు, హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చాలాచోట్ల తమకు తలెత్తిన అనుమానాలను ఈసీ ఇప్పటి వరకు నివృత్తి చేయలేదని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed