ఎర్రచందనం దొంగని హీరోగా చూపించి.. యువతపై రుద్దుతున్నారు: సీపీఐ నారాయణ

by Mahesh |
ఎర్రచందనం దొంగని హీరోగా చూపించి.. యువతపై రుద్దుతున్నారు: సీపీఐ నారాయణ
X

దిశ, వెబ్ డెస్క్: పుష్ప-2 సినిమాపై సీపీఐ నారాయణ(CPI Narayana) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాలో అసలు ఏముంది?.. ఎర్రచందనం దొంగ(Red sandalwood thief)ని హీరోగా చూపించి, దాన్ని యువతపై రుద్దుతున్నారంటు సంచలన వ్యాఖ్యలు(Sensational comments) చేశారు. అలాగే ఫీలింగ్స్ సాంగ్‌కు డాన్స్ చేయడం ఇష్టం లేకపోయినా డైరెక్టర్ చెప్పడం వల్ల చేయాల్సి వచ్చిందని హీరోయిన్ రష్మిక చెప్పారని గుర్తు చేశారు. ఇలా ఎంతోమంది మహిళలు ఆత్మాభిమానం చంపుకుని పని చేస్తున్నారని ప్రశ్నించారు. సంధ్య థియేటర్ ఘటన(Sandhya Theater incident)లో బాధిత కుటుంబానికి 5 కోట్లు ఇచ్చినా ప్రాణాలు తెచ్చి ఇవ్వలేరని అన్నారు. అలాగే సీపీఐ నారాయణ(CPI Narayana) తెలుగు సినిమాలపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు సందేశాత్మక చిత్రాలకు ప్రోత్సాహం ఇవ్వాలని, టికెట్ల ధరలను పెంచడం బ్లాక్ మార్కెట్లకు ప్రోత్సాహం ఇవ్వడమే అన్నారు. అలాగే ప్రభుత్వ నిర్ణయాలు సామాన్య ప్రజలకు భారం పడకుండా ఉండాలని అన్నారు. కాగా ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో టిఫ్డ్క్ చైర్మన్ దిల్ రాజు సారద్యంలో 36మంది సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఇందులో సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేశ్ ఉండగా పలువురు యువ హీరోలతో పాటు.. కొత్త పాత డైరెక్టర్లు ఉన్నారు. అయితే ఈ రోజు జరిగే సమావేశంలో ఏ ఏ విషయాలపై చర్చిస్తారనే ప్రశ్నలు అనేకం ఉన్నాయి.

Advertisement

Next Story