Prison Riot : జైలు నుంచి 1,534 మంది ఖైదీలు పరార్.. ఘర్షణల్లో 33 మంది మృతి

by Hajipasha |
Prison Riot : జైలు నుంచి 1,534 మంది ఖైదీలు పరార్.. ఘర్షణల్లో 33 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో : మొజాంబిక్(Mozambique) దేశ రాజధాని మపుటో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఏడాది అక్టోబరులో వెలువడిన ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ దాఖలైన కేసులో అధికార ఫ్రెలిమో పార్టీకి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా హింసాకాండ చెలరేగింది. కొందరు నిరసనకారులు ఏకంగా రాజధాని మపుటోలోని సెంట్రల్ జైలుపై దాడి(Prison Riot)కి తెగబడ్డారు. దాని నుంచి దాదాపు 1,534 మంది ఖైదీలను విడిపించుకున్నట్లు తెలిసింది. ఈక్రమంలో జైలు వద్ద భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య ఘర్షణల్లో 33 మంది చనిపోయారు. 15 మందికి గాయాలయ్యాయి.

క్రిస్మస్ పండుగ రోజున(డిసెంబరు 25న) చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఆలస్యంగా గురువారం బయటికి వచ్చాయి. దీని వివరాలను మొజాంబిక్ దేశ పోలీస్ జనరల్ కమాండర్ బెెర్నార్డినో రాఫెల్ మీడియాకు వెల్లడించారు. జైలు నుంచి పారిపోయిన ఖైదీల్లో 150 మందిని పట్టుకున్నామని, మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. మరో రెండు జైళ్లలోకి కూడా చొరబడేందుకు నిరసనకారులు యత్నించారని చెప్పారు. ఈ ఘటనకు రెండు రోజుల ముందు కూడా పలుచోట్ల దారుణమైన ఘర్షణలు జరిగాయి. దేశ ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ జరిగిన గొడవల్లో దాదాపు 130 మంది చనిపోయారు.

Advertisement

Next Story

Most Viewed