- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dooradarshini: దూరదర్శిని కలిపింది ఇద్దరిని.. కొత్త మూవీ అనౌన్స్‌మెంట్
దిశ, సినిమా: సువిక్షిత్ బొజ్జ (Suvikshit Bojja), గీతిక రతన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘దూరదర్శిని’ (Dooradarshini). ‘కలిపింది ఇద్దరిని’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీకి కార్తికేయ కొమ్మి (Karthikeya) దర్శకత్వం వహిస్తున్నాడు. వారాహ మూవీ మేకర్స్ పతాకంపై బి.సాయి ప్రతాప్ రెడ్డి, జయ శంకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. 1990వ నేపథ్యంలో అందరి హృదయాలను హత్తుకునే ప్రేమకథగా రూపొందుతున్న ఈ మూవీ టైటిల్ టీజర్‌ను గురువారం ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్ విడుదల చేశారు. ఈసందర్భంగా ఆర్‌పీ పట్నాయక్ (RP Patnaik) మాట్లాడుతూ.. ‘ఈ సినిమా హీరో చాలా కాలంగా తెలుసు. జెమిని సురేష్ ఈ సినిమా గురించి చాలా చెప్పాడు. ఇది తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పే వాడు. చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్న ఈ మూవీ అందరిని 90వ దశకంలోకి తీసుకెళ్లి మీ జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తుంది.
అందరికి వాళ్ల వాళ్ల ప్రేమకథలు కూడా గుర్తుకు వస్తాయి. ఈ సినిమా విజయం సాధించి టీమ్ అందరికి మంచి గుర్తింపు తీసుకరావాలి’ అన్నారు. హీరో సువిక్షిత్ బొజ్జ మాట్లాడుతూ.. ‘అందరికి కనెక్ట్ అయ్యే కథ ఇది. ఈ మూవీ కోసం ఎంతో రీసెర్చ చేసి.. బ్యాక్‌డ్రాప్‌కు తగ్గ నటీనటులతో, లోకేషన్స్‌తో ఎంతో సహజంగా, డిటైల్డ్‌గా దర్శకుడు రూపొందించాడు. ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఇది నా కథ అనుకుంటారు. అందరూ ఎంతో కనెక్ట్ అవుతారు. తప్పకుండా చిత్రాన్ని అందరూ ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు. కాగా.. ఈ మూవీలో సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్, జెమిని సురేష్, లావణ్య రెడ్డి, కిట్టయ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఆనంద్ గుర్రాన,