2025 New Year: న్యూ ఇయర్ వేడుకలపై షాకింగ్ మార్గదర్శకాలు జారీ

by srinivas |   ( Updated:2024-12-26 15:40:29.0  )
2025 New Year: న్యూ ఇయర్  వేడుకలపై  షాకింగ్ మార్గదర్శకాలు జారీ
X

దిశ, వెబ్ డెస్క్: డిసెంబర్ 31, న్యూ ఇయర్ వేడుకలు(News Year Celebrations) సందర్భంగా విశాఖ(Visakha)లో పోలీస్ రూల్స్ కఠినతరం చేశారు. ప్రతి ఏడాది ఈ సిటీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది కూడా అంతకు మించే జరుగుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో పోలీసులు ఇప్పటి నుంచే అలర్ట్ అయ్యారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ సందర్భంగా పలు ఆంక్షలు విధించారు. నగరంలో అసాంఘిక కార్యక్రమాలు, దౌర్జన్యాలు, దాడులు, మద్యం విక్రయాలు, హోటళ్లు, క్లబ్స్, పబ్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ మేరకు పలు మార్గదర్శకాలు(Police Guidelines) విడుదల చేశారు.

డిసెంబర్ 31నుంచి జనవరి 1 వరకూ హోటళ్లు, క్లబ్స్, పబ్‌లకు ఈ మార్గదర్శకాలు పాటించాల్సిందేనని ఆదేశించారు. హోటళ్లు, క్లబ్బులు, పబ్‌లకు రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఈవెంట్స్‌కు ముందస్తు అనుమతి తప్పని సరి చేశారు. అలాగే అన్ని ప్రవేశ, ఎగ్జిట్ పాయింట్లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈవెంట్స్‌లో కళాకారుల దుస్తులు, డ్యాన్సులు, చర్యలు, మాటలతో సహా అన్ని సముచితంగా ఉండాలని ఆదేశించారు. అశ్లీలతలు అసలు ఉండొద్దని సూచించారు. శబ్థసాయిలు పరిమితంగా ఉండాలి. 45 బెసిబెల్స్ కంటే దాటకూడదన్నారు. నొవాటెల్ హోటల్ జంక్షన్, ఆర్కే బీచ్, భీమిలి, గాజువాక,పెందుర్తి పరిసర ప్రాంతాల్లో షీ టీమ్స్ ఉంటాయని, ఎలాంటి ఇబ్బందులు కలిగినా మహిళలు వెంటనే సంప్రదించాలని విశాఖ పోలీస్ కమిషరేట్ మార్గదర్శకాలు జారీ చేసింది. ఎవరు అతిక్రమించినా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించింది.

Advertisement

Next Story

Most Viewed