CM Revanth Reddy : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |
CM Revanth Reddy : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)నేడు మరోసారి ఢిల్లీ(Delhi)కి వెళ్లనున్నారు. సీడబ్ల్యుసీ సమావేశాలకు హాజరయ్యేందుకు కర్ణాటక వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడి నుంచి ఉదయం 10 గంటలకు ఢిల్లీ బయలుదేరతారు. ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Former Prime Minister Manmohan Singh) పార్థివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు(Tributes)అర్పిస్తారు. అనంతరం సాయంత్రానికి తిరిగి ఢిల్లీ నుంచి హైద్రాబాద్ రానున్నారు. ఇప్పటికే మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల రేవంత్ రెడ్డి ఎక్స్ లో తన సంతాపాన్ని తెలిపారు.

మాజీ ప్రధాని మన్మోహన్ గొప్ప ఆర్ధిక వేత్త, మహా నాయకుడు, సంస్కరణ వాది అన్నింటికి మించి గొప్ప మానవతావాది అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మృతితో దేశం ఒక గొప్ప కుమారుడిని కోల్పోయిందని రేవంత్ తన సందేశంలో అవేదన వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు సానుభూతిని సీఎం తెలియజేశారు. నిర్ణయాలు తీసుకోవడంలో సమగ్రత, పారదర్శకత అన్నింటికీ మించి మానవీయ స్పర్శను జోడించేవారని, నవ భారత శిల్పుల్లో మన్మోహన్ సింగ్ ఒకరని కొనియాడారు. రాజకీయ, ప్రజా జీవితంలో గౌరవ మర్యాదలు ఎలా పాటించాలో ఆయన తన ప్రవర్తన ద్వారా చూపించారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed