- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NIMS: నిమ్స్‌లో నిలిచిన ఓపీ సేవలు.. ఆందోళనకు దిగిన రోగులు
దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (Former Minister Manmohan Singh) మృతికి సంతాపంగా ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, పాఠశాలలకు తెలంగాణ సర్కార్ (Telangana Government) శుక్రవారం సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శాంతి కుమారి (CS Shanthi Kumari) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే నగరంలోని నిమ్స్ (NIMS) ఆసుపత్రి వద్ద రోగులు ఆందోళనకు దిగారు. సర్కార్ సెలవు ప్రకటించిన విషయం తెలియకుండా వైద్య పరీక్షల నిమిత్తం నగరంలో వివిధ ప్రాంతాలు, ఇతర జిల్లాల నుంచి నుంచి రోగులు పంజాగుట్టలోని నిమ్స్ (NIMS)కు చేరుకున్నారు. అయితే, వైద్యులు ఓపీ సేవలను (OP Services) నిలిపివేయడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. వైద్య సేవలను మినహాయించి మిగతా వాటికి సెలవు ప్రకటించాలని రోగులు కోరుతున్నారు. తాము చాలా దూరం నుంచి నగరనికి వచ్చామని మళ్లీ వెనక్కి ఎలా వెళ్లాలంటూ చాలా సమయం పడుతోందంటూ రోగులు తమ గోడును వెల్లబోసుకున్నారు.