Pooja Hegde: ఇలా అయిపోయావు ఏంటీ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ లుక్‌పై ట్రోల్స్

by sudharani |   ( Updated:2024-12-26 16:21:27.0  )
Pooja Hegde: ఇలా అయిపోయావు ఏంటీ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ లుక్‌పై ట్రోల్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ (Tollywood) బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde).. ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయింది. అయితే.. గత కొద్ది కాలంగా ఈ అమ్మడు యాక్ట్ చేసిన సినిమాలు వరుస పరాజయాలు చెందడంతో ఈ బ్యూటీ గ్రాఫ్ తగ్గింది. ఇక రాధేశ్యామ్ (Radheshyam) తర్వాత లాంగ్ గ్యాప్ ఇచ్చిన పూజా.. ఇప్పుడు ‘సూర్య44’ (Surya 44) తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది.

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి తాజాగా ‘రెట్రో’ (retro) టైటిల్ ఫిక్స్ చేస్తూ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో పూజా నార్మల్ లుక్ (డీ గ్లామరస్)లో కనిపించి మెప్పించింది. కానీ కొంత మంది పూజా హెగ్డే ఫ్యాన్స్ ఆ లుక్‌ను తట్టుకోలేకపోతున్నారు. దీంతో ఇలా అయిపోయావు ఏంటీ బ్యూటీ అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ‘నిన్న ఇలా తయారు చేశారు ఏంటీ’ అని నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Read More...

నేను రిలేషన్‌లో ఉండటాన్ని ఇష్టపడతాను.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్


Advertisement

Next Story

Most Viewed