కోళ్ల లోడ్ వాహనం బోల్తా.. ఇద్దరికి గాయాలు..

by Sumithra |
కోళ్ల లోడ్ వాహనం బోల్తా.. ఇద్దరికి గాయాలు..
X

దిశ, అలంపూర్ : భూత్పూర్ నుండి కర్నూల్ వైపు కోళ్ల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం గురువారం తెల్లవారుజామున ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తా సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో డ్రైవర్ రంగస్వామి, క్లీనర్ మన్యం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ రంగస్వామి పెద్దదిన్నె గ్రామం, క్లీనర్ మన్యం పెబ్బేరు గ్రామానికి చెందిన వారని గుర్తించారు. వీరిని చికిత్స నిమిత్తం ఉన్న 108 అంబులెన్స్ లో కర్నూల్ కు తరలించినట్లు అంబులెన్స్ పైలట్ మల్లికార్జున్, ఈఎంటీ రాధామోహన్ తెలిపారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని సమాచారం.

Advertisement

Next Story