- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Govt.: నెలాఖరున నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ విరమణ.. ఏపీ కొత్త సీఎస్ ఆయనేనా?
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ డిసెంబర్ 31న పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా ఎవరిని నియమిస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, ఇప్పటికే నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో ఆయనకు మరోసారి అవకాశం లేదు. అదేవిధంగా సీఎం చంద్రబాబుకు కూడా పొడిగింపు ఆలోచన చేయపోవడంతో కొత్త సీఎస్ బాధ్యతలు లాంఛనంగా కనిపిస్తోంది. కాగా, చీఫ్ సెక్రటరీ పదవి కోసం మొత్తం ఎనమిది మంది సీనియర్ ఐఏఎస్‌లు పోటీ పడుతోన్నట్లుగా తెలుస్తోంది. అందులో ఆర్పీ సిసోడియా, అనంత రాము, శ్రీలక్ష్మి, అజయ్ జైన్, సాయిప్రసాద్, సుమితా దావ్రా, విజయానంద్, రాజశేఖర్ ఉన్నారు. వీరిలో ప్రముఖంగా 1992 బ్యాచ్‌కు చెందిన విజయానంద్, 1991 బ్యాచ్‌కు చెందిన ఆర్పీ సిసోడియా, సాయి ప్రసాద్ పేర్లు చంద్రబాబు పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం.