- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Winter: చలికాలంలో రోగనిరోధకశక్తిని వీటితో సులభంగా పెంచుకోవచ్చు!
దిశ, వెబ్ డెస్క్ : చలి కాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ సమయంలో జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలు, మూలికలు పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దాదాపు అందరి ఇళ్లలో అల్లం ఉంటుంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తి పెంచి,
చలి కాలంలో వచ్చే సమస్యలు ఎదుర్కొనేలా చేస్తుంది. ఇది స్త్రీలలో వచ్చే కడుపును నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. చలికాలంలో వచ్చే వ్యాధులకు ఇది మంచి రెమెడీ. దీనిలో యాంటీఆక్సిడెంట్లు, జింజెరాల్ వంటి గుణాలు ఎక్కవగా ఉన్నాయి.
వేడి నీటిలో అల్లం, తేనె వేసి తాగితే గొంతు మంటను తగ్గించి ఉపశమనం కలిగిస్తాయి. గోరువెచ్చని నీటితో అల్లం టీ తీసుకుంటే జలుబు లేదా ఫ్లూకి సంబంధించిన సమస్యలను తగ్గిస్తాయి. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అంతే కాకుండా, ఇది కీళ్ల నొప్పులకు కూడా చెక్ పెడుతుంది. భోజనానికి ముందు లేదా తర్వాత అల్లం టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది. శీతాకాలంలో వచ్చే కండరాల నొప్పి నుండి ఉపశమనం పొందడానికి అల్లం సహాయపడుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.