విశాఖలో పేలిన సిలిండర్ .. ఆరుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం

by srinivas |
విశాఖలో పేలిన సిలిండర్ .. ఆరుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
X

దిశ, వెబ్ డెస్క్: ఇంట్లో గ్యాస్ సిలిండర్(cylinder) పేలి ఆరుగురికి గాయాలైన ఘటన విశాఖ(Visakhapatnam)ఇందిరాగాంధీ నగర్‌లో జరిగింది. ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్న సమయంలో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. దీంతో ఇల్లు ధ్వంసం(House destroyed) అయింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలు కాగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story