Mental health : ఆ విషయంలో మహిళలే ఎక్కువ సఫర్ అవుతున్నారు.. ఎందుకంటే?

by Javid Pasha |
Mental health : ఆ విషయంలో మహిళలే ఎక్కువ సఫర్ అవుతున్నారు.. ఎందుకంటే?
X

దిశ, ఫీచర్స్ : ఓ వైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు వృత్తిపరమైన సవాళ్ల నడుమ పురుషులు అధిక ఒత్తిడిని ఎదుర్కొంటారని చాలా మంది భావిస్తుంటారు. కానీ వాస్తవానికి స్త్రీలే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారని ‘ఎమోషనల్ వెల్‌నెస్’ పేరుతో ఓ సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో వెల్లడైంది. వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ చేయడంలో స్త్రీలు, పురుషులకన్నా ఎక్కువగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆ సర్వేను ఎనలైజ్ చేసిన నిపుణులు పేర్కొన్నారు.

వ్యక్తిగతంగా, వృత్తిపరంగా స్త్రీ, పురుషులు ఎలాంటి మెంటల్ సిచువేషన్స్ ఎదుర్కొంటున్నారో తెలుసుకోవడానికి మొత్తం 5000 మందిని నిపుణులు ప్రశ్నించారు. అయితే ఈ సందర్భంగా వీరు దాదాపు 72.2 శాతం మంది మహిళలు అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. అదే పురుషుల విషయానికి వస్తే 53.64 శాతం మంది మాత్రమే ఒత్తిడి స్థాయిలను అనుభవిస్తున్నారు. ఇక ఒత్తిడికి కారణాలను విశ్లేషించగా ఉద్యోగం చేస్తున్న స్త్రీ, పురుషులను పోల్చినప్పుడు, పురుషులు కేవలం వృత్తిపరమైన పనులకే ప్రాధాన్యత ఇస్తూ ఇంటి పనులు, కుటుంబ బాధ్యతల విషయంలో తక్కువ ఫోకస్ చేస్తున్నారు. స్త్రీలు మాత్రం అలా కాకుండా ఓవైపు ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలతోపాటు మరో వృత్తిపరమైన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో ఎక్కువగా సఫర్ అవుతున్నట్లు సర్వేను విశ్లేషించిన నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు పనికి తగిన గుర్తింపు లేకపోవడం, వర్క్‌ప్లేస్‌లో అభద్రతా భావం వంటివి కూడా 20 శాతం మంది మహిళల్లో మానసిక ఒత్తిడికి కారణం అవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed