Mohan Babu : అజ్ఞాతం వీడని మోహన్ బాబు..అరెస్టుకు అవకాశం!

by Y. Venkata Narasimha Reddy |
Mohan Babu : అజ్ఞాతం వీడని మోహన్ బాబు..అరెస్టుకు అవకాశం!
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో అల్లు అర్జున్(Allu Arjun)అరెస్టు రచ్చ ఒకవైపు.. సీనియర్ నటుడు మోహన్ బాబు(Mohan Babu)కేసు రాద్ధాంతం ఇంకోవైపు ఆసక్తికరంగా మారాయి. జర్నలిస్టుపై దాడి కేసులో నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు అరెస్టు చేయకుండా ఇచ్చిన గడువు పూర్తి కాగా, ఆయన మాత్రం ఇప్పటిదాకా పోలీసుల విచారణకు హాజరుకాలేదు. దీంతో మోహన్ బాబుకు మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు రాకపోతే అరెస్టు(Arrest) చేసేందుకు పహాడి ఫరీఫ్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు ఎక్కడున్నారన్నారన్న సదానిపై సమాచారం లేకపోవడంతో ముందుగా ఆయన ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

జర్నలిస్టుపై దాడి కేసులో తనను అరెస్టు చేయకుండా మోహన్ బాబు అనారోగ్య కారణాలతో కోర్టు నుంచి డిసెంబర్ 24వరకు అనుమతి తెచ్చుకున్నారు. ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు వేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. అవసరమైతే దిగువ కోర్టుకు వెళ్లాలని సూచించింది. అటు ముందస్తు బెయిల్ రాకపోవడం..ఇటు అరెస్టుపై కోర్టు ఇచ్చిన గడువు ముగిసిపోవడంతో మోహన్ బాబు పోలీసుల ముందు హాజరుకావాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. అయితే మోహన్ బాబు పోలీసుల విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసులు ఆయనకు మరోసారి నోటీసులిచ్చి ఏ క్షణాన్నైనా అరెస్టు చేస్తారన్న ప్రచారం వినిపిస్తుంది. అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన నేపథ్యంలో మోహన్ బాబును అరెస్టు చేయకపోతే జనంలోకి తప్పుడు సంకేతాలు వెలుతాయన్న కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారని, అందుకే మోహన్ బాబు అరెస్టు ఖాయమని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed