Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీని త్వరలోనే అరెస్టు చేస్తారు- కేజ్రీవాల్ సంచనల వ్యాఖ్యలు

by Shamantha N |
Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీని త్వరలోనే అరెస్టు చేస్తారు- కేజ్రీవాల్ సంచనల వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీని(CM Atishi) అరెస్టు చేసే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal ) అన్నారు. ‘ఫేక్ కేసులో’ అతిశీని అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇటీవలే ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన మహిళా సమ్మాన్ యోజన(Mahila Samman Yojana), సంజీవని యోజనతో(Sanjeevani Yojana) సహా పలు సంక్షేమ పథకాలపై కొందరు అందోళన చెందుతున్నారని అన్నారు. “మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన ద్వారా కొంత మంది ఇబ్బంది పడుతున్నారు. ఫేక్ కేసులో అతిశీని మరికొద్ది రోజుల్లో అరెస్ట్ చేయాలని ప్లాన్ చేశారు. అంతకంటే ముందు, ఆప్ సీనియర్ నేతలపై దాడులు నిర్వహిస్తారు' అని కేజ్రీవాల్ సోషల్ మీడియా ఎక్స్ లో రాసుకొచ్చారు. ఈ కుట్రలను బయటపెట్టేందుకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఆప్ ప్రకటనలు

ఇకపోతే, త్వరలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ‘మహిళా సమ్మాన్‌ యోజన’ కింద మహిళలకు ప్రతినెలా రూ.2,100 ఆర్థికసాయం చేస్తామని ఆప్‌ (AAP) ప్రకటించింది. దీంతో పాటు ‘సంజీవని యోజన’ కింద ఢిల్లీలోని సీనియర్‌ సిటిజన్లు అందరికీ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను కూడా ఇప్పటికే స్వీకరిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో రాజకీయంగా దుమారం రేగుతోంది.

Advertisement

Next Story

Most Viewed