- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PV Sindhu: పి.వి. సింధు వెడ్డింగ్ రెసెప్షన్‌లో హైలెట్‌గా నిలిచిన ప్రముఖ సెలబ్రిటీస్ అండ్ CM
దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం నాడు ఇండియన్ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు(Indian famous badminton player P.V. Sindhu) వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ఈ జంట వివాహం రాజస్థాన్(Rajasthan)లోని ఉదయ్‌పూర్(Udaipur)లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఆదివారం రాత్రి 11.20 నిమిషాలకు సింధు మెడలో వెంకట దత్త సాయి(Venkata Datta Sai) మూడుముళ్లు వేశారు. తెలుగు సంప్రదాయ పద్దతిలో సింధు, దత్త సాయి వివాహం చేసుకున్నారు. ఈ జంట పెళ్లికి కుటుంబసభ్యులు, సన్నిహితుల సహా 140 మంది వరకు అతిథులు హాజరైనట్లు సమాచారం. రాజస్థాన్‌లో పి. వి సింధు పెళ్లి జరగ్గా.. తాజాగా ఈమె రెసెప్షన్ హైదరాదులో అంగరంగ వైభవంగా చేసుకున్నారు. వీరి రిసెప్షస్‌కు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీస్ హాజరై సందడి చేశారు.
టాలీవుడ్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), తమిళ ప్రముఖ నటుడు అజిత్(Tamil famous actor Ajith).. టాలీవుడ్ హీరోయిన్ మృణాల్(Tollywood heroine Mrinal), సింగర్ మంగ్లీ(Singer Mangli) హాజరయ్యరు. వీరితో పాటుగా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా(Indian tennis star Sania Mirza).. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Telangana Chief Minister Revanth Reddy), హరీష్ రావు(Harish Rao), కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy) పలువురు రాజకీయ నాయకులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.