- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ITBP Recruitment: కానిస్టేబుల్ పోస్టులకు ఐటీబీపీ నోటిఫికేషన్ రిలీజ్.. అర్హత, జీతం వివరాలివే..
దిశ,వెబ్‌డెస్క్: భారత రక్షణశాఖ(Ministry of Defense)కు చెందిన ఇండో- టిబెటిన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ITBP) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 51 హెడ్ కానిస్టేబుల్(Head Constable), కానిస్టేబుల్(Constable) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://recruitment.itbpolice.nic.in/rect/index.php ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 22 జనవరి 2025.
పోస్టులు, ఖాళీలు:
హెడ్ కానిస్టేబుల్(Motor Mechanic) - 07
కానిస్టేబుల్(Motor Mechanic) - 44
విద్యార్హత:
హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్, కానిస్టేబుల్ పోస్టులకు ఐటీఐ, టెన్త్ క్లాస్ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.
వయోపరిమితి:
22 జనవరి, 2025 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం:
హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నెలకు రూ. 25,500- రూ.81,100, కానిస్టేబుల్ పోస్టులకు నెలకు రూ. 21,700- రూ. 69,100 వరకు జీతం ఉంటుంది.