- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌లో దూసుకెళ్తున్న రియల్ ఎస్టేట్.. హెచ్ఎండీఏ కీలక ప్రకటన
దిశ, తెలంగాణ బ్యూరో: ‘హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా దూసుకెళ్తుంది. రియల్ ఎస్టేట్ పడిపోయిందని వస్తున్నా వార్తల్లో ఏలాంటి వాస్తవం లేదు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ తగ్గింది అనడం అబద్ధం. గతేడాది రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిలో హైదరాబాద్ గణనీయంగా వేగంగా పురోగతిని కనబరిచింది. అభివృద్ధి విధానాలు విదేశీ పెట్టుబడులకు ఊతమిస్తున్నాయి’ అని హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫారాజ్ అహ్మద్ వివరించారు. బుధవారం హెచ్ఎండీఏ ప్రధాన కార్యాయలంలో ఏర్పాటు చేసిన స్క్రీన్ ద్వారా వర్చ్యవల్ చిట్ చాట్‌లో ఆయన పలు విషయాలు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ శ్రీవస్త్య కోట, హెచ్ఎండీఏ కార్యదర్శి చంద్రయ్య, పబ్లిక్ హెల్త్ విభాగం ఈఎన్సీ దేవానంద్, ప్లానింగ్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ నాయక్, జీహెచ్ఎంసీ సీసీపీ కె.శ్రీనివాస్ ఉన్నారు. ఈ సందర్భంగా సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీ పెరుగుదల, రెసిడెన్షియల్ అమ్మకాలలో పెరుగుదల వంటి అంశాలు పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగానికి గొప్ప బలాన్ని ఇచ్చాయని అన్నారు.
దరఖాస్తుల స్వీకరణ, అనుమతుల జారీ..
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో డవలప్ మెంట్ దరఖాస్తుల స్వీకరణ, కొత్త భవన నిర్మాణ దరఖాస్తుల స్వీకరణ,ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ల దరఖాస్తుల స్వీకరణ,లేఅవుట్ల దరఖాస్తుల స్వీకరణతోపాటు అనుమతుల జారీ విషయంలో గణనీయమైన వ్రుద్ధి సాధించినట్టు తెలిపారు.
అంశం 2023 2024 వృద్ధి శాతం
డవలప్ మెంట్ దరఖాస్తుల స్వీకరణ 1326 1920 45
కొత్త భవన నిర్మాణ దరఖాస్తుల స్వీకరణ 756 1061 40
ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ల దరఖాస్తుల స్వీకరణ 467 560 20
లేఅవుట్ల దరఖాస్తుల స్వీకరణ 103 299 190
డవలప్ మెంట్ అనుమతుల జారీ 2065 2563 24
భవన నిర్మాణ అనుమతుల జారీ 1196 1414 18
ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ల జారీ 690 811 18
లేఅవుట్ల అనుమతుల జారీ 179 335 87
నవంబర్ మాసంలోనే..
ఈఏడాది నవంబర్ మాసంలో వచ్చిన దరఖాస్తులు, ఇచ్చిన అనుమతులను పరిశీలిస్తే రియల్ ఎస్టేట్ రంగం ఎంత వేగంగా దూసుకెళ్తుందో అర్థమవుతోందని అన్నారు. కొత్త డవలప్ మెంట్ పర్మిషన్లకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ 49శాతం, ఇచ్చిన అనుమతుల విషయంలో 48శాతం పెరిగిందని చెప్పారు. కొత్త భవన నిర్మాణ అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తుల్లో 53శాతం, అనుమతుల జారీ విషయంలో 42శాతం పెరిగాయని తెలిపారు. ఆక్యూపెన్సీ సర్టిఫికెట్లకు సంబంధించిన దరఖాస్తుల పెరుగుదల 4శాతం ఉంటే జారీచేసిన విషయంలో 27శాతం, ఇండ్ల నిర్మాణ కోసం, ఒపెన్ ప్లాట్ల కోసం ఏర్పాటు చేసిన లేఅవుట్ల దరఖాస్తుల విషయంలో 306శాతం, అనుమతుల జారీ విషయంలో 187శాతం పెరిగిందని వివరించారు. ఈ ఏడాది ప్రథమార్థంలో రూ.58,481 కోట్లతో హౌసింగ్ విక్రయాల విలువలో హైదరాబాద్ ఐదేళ్ల గరిష్టాన్ని నమోదు చేసిందని తెలిపారు. జూన్ 2024లోనే నగరంలో రూ. 4288 కోట్ల విలువైన నివాస ఆస్తుల విక్రయాలు నమోదయ్యాయని చెప్పారు. ఆఫీసు లీజింగ్‌కు సంబంధించి నగరం ఆరోగ్యకరమైన 2.5 మిలియన్ చదరపు అడుగుల నమోదు చేసిందని, ఇది 2023 నాటి సగటు త్రైమాసిక లీజింగ్ కార్యకలాపాలను 11 శాతం అధిగమించిందని పేర్కొన్నారు. ప్రపంచ పెట్టుబడిదారులకు పెట్టుబడి గమ్యస్థానంగా తన సామర్థ్యాన్ని ప్రదర్శించడంలో తెలంగాణ దూసుకెళ్తుందని చెప్పారు. వచ్చే ఏడాదిలో హెచ్-సిటీలో భాగంగా ప్రభుత్వం ప్రతిపాదించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు, ఫ్లైఓవర్లు/గ్రేడ్ సెపరేటర్ల నిర్మాణం, అండర్‌పాస్, జంక్షన్ల అభివృద్ధి, రోడ్ల విస్తరణ పనులు చేపట్టనున్నామని చెప్పారు. దీంతో కొత్త పరిశ్రమలు రావడానికి సానుకూల వాతావరణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి మాట్లాడుతూ
జీహెచ్ఎంసీ చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. 38హెచ్-సిటీ కింద రూ.7032 కోట్ల అంచనాతో 38 ప్రాజెక్ట్‌లు, సీఆర్ఎంపీ రెండో దశ కింద 934 రోడ్లు 1143కి.మీ మార్గంలో పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. ఎస్ఎన్డీపీ రెండో దశలో భాగంగా రూ.667.28కోట్లతో 40 పనులు చేయనున్నామని తెలిపారు.