తెలంగాణలో కల్తీ కల్లు కలకలం.. ఇద్దరి పరిస్థితి విషమం

by Mahesh |   ( Updated:2024-12-26 03:26:14.0  )
తెలంగాణలో కల్తీ కల్లు కలకలం.. ఇద్దరి పరిస్థితి విషమం
X

దిశ, వెబ్ డెస్క్: ఎక్కడో నార్త్ రాష్ట్రాలకు పరిమితమైన కల్తీ కల్లు ఘటన.. తెలంగాణలో కలకలం రేపింది. కాగా కల్తీ కల్లు తాగి ఆరుగురు ఆస్పత్రి పాలైన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా, శాలీగౌరారం మండలంలోని పెర్కకొండారంలో బుధవారం రాత్రి కల్తీ కల్లు ఘటన చోటు చేసుకుంది. వివిధ పనుల పూర్తి చేసుకుని ఇంటికి వచ్చే క్రమంలో సదరు వ్యక్తులు కల్లు తాగి ఇంటికి వెళ్లారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆరుగురు వ్యక్తులు ఒక్కసారిగా వాంతులు చేసుకోవడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. తాము తాగిన కల్లు కల్తీకి గురైందని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో హుటాహుటిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా.. ఆరుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ తరలించారు. కాగా ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

Next Story