Bihar couple: పని కోసం వచ్చి నగలతో పరార్! చిక్కిన బిహార్‌ జంట అరెస్ట్

by Ramesh N |
Bihar couple: పని కోసం వచ్చి నగలతో పరార్!   చిక్కిన బిహార్‌ జంట అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజేంద్రనగర్‌ (Rajendranagar) పోలీస్ స్టేషన్ పరిధిలో చోరికి పాల్పడిన (Bihar couple) బీహార్‌కు చెందిన జంటను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. (Bandlaguda Jagir) బండ్లగూడలోని మ్యాపిల్ టౌన్‌షిప్ విల్లాలో నివాసం ఉండే డాక్టర్ కొండల్‌రెడ్డి ఇంట్లో పనికి చేరిన బీహార్ దంపతులు డిసెంబర్ 23 వ తేదీన 25 తులాల నగలు, రూ.35 వేల నగదుతో ఉడాయించారు. ఇంటి ఓనర్ కొండల్ రెడ్డి మంగళవారం ఉదయం నిద్ర లేచి చూసేసరికి దంపతులు కనిపించకుండా పరారయ్యారు. సీసీ ఫుటేజీలో చోరీకి సంబంధించిన దృశ్యాలు రికార్డు అవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలోనే దోచుకున్న సొమ్ముతో బీహార్ పారిపోతుండగా (Nampally Railway Station) నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద రాజేంద్రనగర్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గత నవంబర్ 1 వ తేదీన ఏజెంట్ ద్వారా ఇంట్లో పని చేసేందుకు బిహార్‌కు చెందిన నమీన్ కుమార్ యాదవ్, భారతిలను నెల జీతంపై డాక్టర్ ఇంట్లో పనికి తీసుకొచ్చారు. తమ విల్లాలోని ఓ గదిని ఇచ్చి వారిని ఉండనిచ్చారు. ఇక, ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీహార్ దంపతులు చోరీకి పాల్పడి అడ్డంగా బుక్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed