- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మృతదేహాన్ని అప్పగించేందుకు తిప్పలు పెట్టిన ఆసుపత్రి యాజమాన్యం..
దిశ, మంచిర్యాల : చెస్ట్ పెయిన్ వచ్చిందని మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి చికిత్స పొందుతూనే ప్రాణాలు విడిచారు. ఆసుపత్రి యాజమాన్యం మాత్రం ఒక్కరోజు చికిత్స కోసమైన రూ. 4.50 లక్షల బిల్లు చెల్లించి మృతదేహాన్ని తీసుకు వెళ్లాలని చెబుతున్న వైనమిది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో బాధితులు సదరు ఆసుపత్రి ఎదుట మృతదేహం కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి పట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కు చెందిన కొంగ. శ్రీనివాస్ అనే వ్యక్తికి మంగళవారం రాత్రి చెస్ట్ పెయిన్ వచ్చింది. దీంతో హుటాహుటిన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు హాస్పిటల్ లో అతన్ని అడ్మిట్ చేశారు. చికిత్స ప్రారంభించిన వైద్యులు రూ. లక్ష 80 వేల ప్యాకేజీకి అగ్రిమెంట్ చేసుకున్నారు. లక్షా 50 వేల రూపాయలు ముందస్తుగానే డిపాజిట్ చేయించుకున్నారు. కాగా డబ్బులు కట్టాక కేవలం 45 నిమిషాల్లోనే పేషెంట్ శ్రీనివాస్ చనిపోయారని చెప్పడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఆసుపత్రి ఎదుట పడిగాపులు...
మంచిర్యాల ఓ ప్రయివేటు హాస్పిటల్ ముందు డెడ్ బాడీ కోసం కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం రోజు రాత్రి 7 గంటల సమయంలో కొంగ శ్రీనివాస్ మృతి చెందగా తెల్లవారి (బుధవారం) డెడ్ బాడీని తీసుకుని వెళ్ళమని ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది చెప్పారు. తీరా తెల్లారేసరికి హాస్పిటల్ బిల్లు రూ.4 లక్షల 50 వేలు అయిందని, మిగతా మూడు లక్షలు కట్టి బాడిని తీసుకెళ్ళమని చెబుతుండడంతో మృతుని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా ఒక్కరోజు చికిత్స కోసం రూ.4 లక్షల 50 వేలు ఎలా అవుతుందని, అంతటి ఆధునిక వైద్య చికిత్స అందించినప్పుడు వ్యక్తి ప్రాణాలు ఎలా పోతాయని పలువురు నివ్వెరపోతున్నారు. మొత్తానికి సదరు మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతుండగా ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఆస్పత్రి యాజమాన్యం, బాధిత కుటుంబం ఇరువర్గాల సంప్రదింపులతో ఎట్టకేలకు మృతదేహాన్ని ఆసుపత్రి యాజమాన్యం బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించింది.