OYO Hotel Bookings: ఓయో హోటల్స్ బుకింగ్స్ లో హైదరాబాద్ టాప్ ప్లేస్..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-12-24 17:26:26.0  )
OYO Hotel Bookings: ఓయో హోటల్స్ బుకింగ్స్ లో హైదరాబాద్ టాప్ ప్లేస్..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఈ ఏడాది అత్యధికంగా ఓయో(OYO) హోటల్స్ బుకింగ్స్ అయినా నగరంగా తెలంగాణ(TG) రాజధాని హైదరాబాద్(HYD) టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ విషయాన్ని ప్రముఖ హాస్పిటాలిటీ టెక్ ఫ్లాట్ ఫామ్ ఓయో 'ట్రావెలోపీడియా-2024(Travelopedia-2024) మంగళవారం ఓ నివేదికలో వెల్లడించింది. ఓయో హోటల్స్ బుకింగ్స్ లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండాగా.. బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా ఆ తర్వాతి స్థానల్లో నిలిచాయి. రాష్ట్రాల పరంగా చూసుకుంటే తెలంగాణ టాప్ లో ఉండగా.. మహారాష్ట్ర, కర్ణాటక అధిక మొత్తంలో బుకింగ్స్ అయినట్టు నివేదిక వెల్లడించింది. ఇక టూరిస్ట్(Tourist) ప్రదేశాల్లో రాజస్థాన్ రాజధాని జైపూర్ ఫస్ట్ ప్లేసులో ఉండగా.. గోవా, పుదుచ్చేరి, మైసూర్ నగరాలు రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇక ఆధ్యాత్మిక కేంద్రాల(Spiritual Centers) జాబితాలో ఒడిశాలోని పూరీ టాప్ లో నిలవగా.. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి, ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే గతేడాదితో పోల్చుకుంటే పాట్నా, రాజమండ్రి, హుబ్లీ వంటి చిన్న పట్టణాలకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగినట్లు ఓయో నివేదిక పేర్కొంది. ఇక దేశంలోనే అత్యంత పాపులర్ పర్యాటక రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. తర్వాత స్థానాల్లో తెలంగాణ, కర్ణాటక నిలిచాయి.

Also Read...

Tata Capital IPO: వచ్చే ఏడాది ఐపీఓకు రానున్న టాటా క్యాపిటల్..!

Advertisement
Next Story

Most Viewed