- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శతక్కొట్టిన హర్లీన్ డియోల్.. వన్డే సిరీస్ కూడా భారత్‌దే
దిశ, స్పోర్ట్స్ : భారత మహిళల క్రికెట్ జట్టు దూకుడు కొనసాగుతోంది. వెస్టిండీస్‌పై టీ20 సిరీస్ దక్కించుకున్న భారత్.. వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. వడోదరలో మంగళవారం జరిగిన రెండో వన్డేలో భారత్ 115 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ముందుగా టీమిండియా 358/5 స్కోరు చేయగా.. ఛేదనలో విండీస్ 243 పరుగులకే ఆలౌటైంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నెగ్గడంతో ఆఖరి వన్డే మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ టీమిండియా సొంతమైంది. ఇక, శుక్రవారం జరిగే చివరి మ్యాచ్ నామమాత్రమే కానుంది.
బ్యాటుతో దంచికొట్టి.. బంతితో కూల్చేశారు
భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఏకపక్ష విజయాలను నమోదు చేస్తోంది. రెండో వన్డేల్లోనూ అదే జోరు ప్రదర్శించింది. ముందుగా భారత బ్యాటర్లు విండీస్ బౌలర్లను ఊచకోతశారు. భీకర ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన(53) మరోసారి హాఫ్ సెంచరీతో మెరిసింది. మరో ఓపెనర్ ప్రాతిక రావ్(76) కూడా రెచ్చిపోయారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. స్మృతి అవటవడంతో క్రీజులోకి వచ్చిన హర్లీన్ డియోల్(115) ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకపడింది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన ఆమె కెరీర్‌లో తొలి శతకం నమోదు చేసింది. ఇక, ఆఖర్లో రోడ్రిగ్స్(52) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగింది. ఇలా భారత బ్యాటర్లు రెచ్చిపోవడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లే కోల్పోయి 358 రన్స్ చేసింది. వన్డేల్లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. అనంతరం భారత బౌలర్లు తమ పాత్ర నిర్వర్తించారు. ప్రియ మిశ్రా 3 వికెట్లు, దీప్తి, టిటాస్ సాధు, ప్రాతిక రెండేసి వికెట్లతో ప్రత్యర్థిని కుప్పకూల్చారు. దీంతో ఛేదనలో విండీస్ 46.2 ఓవర్లలోనే 243 పరుగులు చేసి ఆలౌటైంది. కెప్టెన్, ఓపెనర్ హేలీ మాథ్యూస్(106) సెంచరీతో పోరాటం చేసినప్పటికీ ఆమె శ్రమ ఫలించలేదు. భారత బౌలర్లు ధాటికి మిగతా బ్యాటర్లు క్రీజులో నిలువకపోవడంతో విండీస్ భారీ ఓటమిని చవిచూసింది.
సంక్షిప్త స్కోరుబోర్డు
భారత్ ఇన్నింగ్స్ : 358/5(50 ఓవర్లు)
(హర్లీన్ డియోల్ 115, ప్రాతిక రావల్ 76, స్మృతి మంధాన 53, రోడ్రిగ్స్ 52)
వెస్టిండీస్ ఇన్నింగ్స్ : 243 ఆలౌట్(40.2 ఓవర్లు)
(హేలీ మాథ్యూస్ 106, కాంప్‌బెల్లె 38, ప్రియ మిశ్రా 3/49, ప్రాతిక రావల్ 2/37, దీప్తి శర్మ 2/40, టిటాస్ సాధు 2/42)
- Tags
- #IND W vs WI W